Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
న్యూ లిటిల్ ఫ్లవర్ ఎన్సిసి 11(టీ)వ బెటాలియన్ క్యాడెట్ల సహకారంతో పూనిత సాగర్ అభయాన్ పథకంలో భాగంగా ఆదివారం వైరా జలాశయ పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్ధాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పి.భూమేష్ రావు, డైరెక్టర్ కుర్రా సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన వైరా సబ్ ఇన్స్పెక్టర్ శాఖమూరి వీర ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ పి. భూమేష్ రావు, కుర్ర సుమన్ మాట్లాడుతూ సముద్రతీరాలు/బీచులను ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను సముద్ర తీరాల వెంబడి శుభ్రం చేయడానికి చేపట్టిన పథకంలో భాగంగా వైరా జలాశయం వెంబడి ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాలను తొలగించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జలాశయంలోనే నీరు పరిశుభ్రంగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుందన్నా రు. వ్యర్థాలతో జలాశయాలు కలుషితమైతే మూగ జీవాల ప్రాణాలకు కూడా రక్షణ ఉండదని, అందువలన నదులను, చెరువులను పరిశుభ్రంగా ఉంచేటందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు. వైరా సబ్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ మాట్లాడుతూ వైరా జలాశయం పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ఎంతోమంది ప్రజలకు, మూగజీవాలకు దాహార్తిని తీర్చేటువంటి అతిపెద్దది వైరా జలాశయం అన్నారు. అటువంటి జలాశయాన్ని పూనిత సాగర్ అభయాన్ పథకం కింద లిటిల్ ఫ్లవర్ స్కూల్ 11వ బెటాలియన్‌కు చెందిన ఎన్సిసి క్యాడెట్ ల ఆధ్వర్యంలో వైరా జలాశయ పరిసరాలను శుభ్రం చేయడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి కేర్ టేకర్ రవీందర్, ఎన్సిసి 11వ బెటాలియన్ క్యాడెట్లు పాల్గొన్నారు.