Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య
నవతెలంగాణ-చింతకాని
రామకృష్ణాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించనున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం రామకృష్ణాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి మంత్రి అజరు కుమార్తో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డి ఎమ్మెల్సీ తాత మధు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు హాజరవుతారని వీరి సమక్షంలో పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. కావున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణయ్య, వైస్ ఎంపీపీ హనుమంతరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు మంకెన రమేష్, మండల కన్వీనర్ మనోహర్ బాబు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.