Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
సీఎల్పీ లీడర్ మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క కృషితో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు గట్ల గౌరారం గ్రామానికి చెందిన హరిలక్ష్మికి రూ.60వేల, నారా యణపురం గ్రామానికి చెందిన రాధకు రూ.40,500, వెంకటాపురం గ్రామానికి చెందిన యనమల ఆంధ్రారెడ్డికి రూ.14,500, అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డికి రూ.19,500, మామునూరు గ్రామానికి చెందిన రాజారపు వెంకటే శ్వర్లు కు రూ.22,500, చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డికి రూ.19,500, కొత్తపాలెం గ్రామానికి చెందిన రమేష్ కి రూ.12,000, ఎర్రుపాలెం గ్రామానికి చెందిన సూరంశెట్టి పద్మావతికి రూ.9వేలు, అదే గ్రామానికి చెందిన కంచర్ల వీరయ్యకు 42వేలు, అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన మొండ్రు పవిత్ర కు 14,500, జమలాపురం గ్రామానికి చెందిన బాణావత్ కృష్ణకు రూ.17,000 లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారు నరసింహారావు, ఎర్రు వెంకట్రావు, లింగాల నాగేశ్వరరావు, కోటపాటి పాండురంగరావు, షేక్ జానీభాష, షేక్ ఇస్మాయిల్, దేవరకొండ శ్రీనివాసరావు, కంచర్ల వెంకట నరసయ్య, సూరం శెట్టి రాజేష్, లక్ష్మారెడ్డి, లబ్ధిదారులు, పాల్గొన్నారు.