Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్ధులతో భర్తీ చేయుటకు ఆదివారం కొత్తగూడెంలోని సింగరేణి మహిళా జూనియర్, డిగ్రీ అండ్ పీజి, ప్రియదర్శిని, కేవైకేఆర్వై అండ్ బిఎన్ గౌడ్స్ జూనియర్ కళాశాల, సెంట్ మేరిస్, సింగరేణి, ఎస్ఆర్ డిజి స్కూల్, శారదా విద్యాలయలో రాత పరీక్ష నిర్వహించారు. సంస్థలో ఖాళీగా ఉన్న 155 పోస్టులకు గాను 3515 అభ్యర్ధులకు హాల్ టికెట్లు జారీ చేశారు. వివిధ ఏరియాల నుండి 3305 మంది అభ్యర్ధులు హాజరైయ్యారు. ఈ రాత పరీక్ష సింగరేణి యాజమాన్యం అత్యంత పారదర్శకతతో నిర్వహించామని సింగరేణి డైరెక్టర్ (పా) అండ్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను ఆయన సందర్శించారు. పరీక్ష తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు కె. బసవయ్య, ఎంఎస్ సురేష్ బాబు, శ్రీరామ్ కుమార్, శశిధర్ రాజు, హనుమంతరావు, పిచ్చయ్య శాస్త్రి ఏ.కుమార్ రెడ్డి, బిహెచ్ వెంకటేశ్వరరావు, జె.కుమారస్వామి పాల్గొన్నారు.