Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే ఆర్టీజన్లుగా గుర్తించండి
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్లో గత 20 ఏండ్లుగా అతి తక్కువ వేతనాలతో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న మాకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంటాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రాణాలు లెక్క చేయకుండా విద్యుత్పత్తికి ఎంతో కష్టపడ్డామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీఎస్ జెన్కో టీఎస్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు ఇదే సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ బోర్డు సర్వీసులో విలీనం చేస్తామని హామీ ఇచ్చి కండిషన్లు పెట్టారని తెలిపారు. అయినప్పటికీ అన్ని కండిషన్లకు అర్హతలు ఉన్న మా దగ్గర ఆధారాల్ని సమర్పించి నా ఐడీ కార్డులు కేటాయించాలని చెప్పారు. అయినప్పటికీ 2017, 29న కాంట్రాక్టు కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసిన కాంట్రాక్టు కార్మికులకు హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని మాకు నిలుపుదల చేశారని చెప్పారు. మళ్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉన్న పెండింగ్ కేసు తీర్పు ఇస్తూ 12 వారాల్లో మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను ఆర్టిజన్లు చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ జెన్కో యజమాన్యం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్మికులు సిహెచ్ రమేష్, జి.బాల నరసింహారావు, నాగరాజు, యాకయ్య, రమేష్, ఉపేందర్, దయాకర్ రెడ్డి, సురేష్ కుమార్, రమణ, రమాదేవి ఐలయ్య సురేష్ మల్లయ్య గోపి తదితరులు పాల్గొన్నారు.