Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
- జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవ తెలంగాణ-బూర్గంపాడు
పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు, బతుకమ్మ పండుగ సారెగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్ర మంలో జెడ్పీటీసీ శ్రీలత పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతే బతుకమ్మ పండుగకు ఆదరణ పెరిగిందన్నా రు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ, ఉపాధి పథకాలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని అన్నారు. నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం స్థానిక మహిళలు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భగవాన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భిక్కసాని శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సర్పంచులు సిరిపురపు స్వప్న, శ్రావణి, లక్ష్మి, భారతి, నాగమణి, చిన్నబ్బాయి, సూరమ్మ, టిఆర్ఎస్ పార్టీ యువజన మండల అధ్యక్షులు గోనెల నాని, బాలాజీ పాల్గొన్నారు.