Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటస్ఫూర్తిని కొనియాడిన వక్తలు
నవతెలంగాణ-కొత్తగూడెం
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రైతులను, కూలీలను ఏకం చేసి సాయుధ పోరాటం చేసిన బహుజన ధీశాలి చాకలి ఐలమ్మఅని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని చుంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీ, రజక కాలనీలో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కణతల వసంతరావు, బాపనపల్లి సర్వేశ్వరరావు, పొగుల లక్ష్మీనారాయణ, ఐతం రాజుల బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్ వీణ, తదితరులు పాల్గొన్నారు.
వీరనారి అయిలమ్మ : తెలంగాణ వీర మహిళా యోధురాలు చాకలి ఐలమ్మ అని జిల్లాదిశ అధ్యక్షురాలు వేముల భారతి, అశ్వారావుపేట మండల అధ్యక్షురాలు ఎండీ రెహానా బేగం అన్నారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీపంలో వున్న సత్తుపల్లి పట్టణంలో వున్న ఆమె విగ్రహానికి ఘనంగా పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
గ్రంధాలయంలో : పోరాడిన స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు. చాకలి అయిలమ్మ జయంతి వేడుకలు లైబ్రరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది నవీన్ కుమార్, గ్రంథ పాలకురాండ్లు డి. వరలక్ష్మీదేవి, జి.మణి మృధుల, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
చండ్రుగొండ ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు ముందుకు సాగాలని సీపీఐ(ఎం) మండల ఆర్గనైజర్ పెద్దిని వేణు పిలుపునిచ్చారు. సోమవారం ఐలమ్మ జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోట్రు భద్ర రావు, హమాలీ సంఘం సభ్యులు సత్యనారాయణ, శ్రీను, రజక సంఘం నాయకులు శివ, నాగులు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : ఐలమ్మ 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని పశు వైద్యాధికారి డాక్టర్ మన్యం రమేష్ బాబు స్పష్టం చేశారు. సోమవారం దమ్మపేట పశు వైద్యశాలలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మన్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు పశు వైద్య సిబ్బంది నాగేశ్వరరావు, ప్రసాదు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : చాకలి ఐలమ్మ జయంతిని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎంపీపీ గుమ్మడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మకు పూలతో ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అజారుద్దీన్, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, దొరబాబు, బోడ లక్ష్మణ్ రావ్, వారా నరసింహారావులు పాల్గొన్నారు.