Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-కొత్తగూడెం
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేపించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ కార్మిక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులు ఈ-శ్రమ్ పోర్టల్లో అసంఘటిత రంగ కార్మికుల పేర్లు నమోదు, బతుకమ్మ వేడుకలు, నూతన చౌక ధరల దుకాణాలకు డీలర్లు నియామకం, వైద్య, వసతిగృహాల్లో ఆహార కల్తీలు జరుగకుండా చేపట్టాల్సిన రక్షణ చర్యలు, ఆసరా పించన్ల కార్డుల పంపిణీ, ధరణి తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అసంఘటిత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేందుకు చేపట్టిన నమోదులు ప్రక్రియ నత్తనడకన జరుగుతున్నదని వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ, బిసి, మైనార్టీ, గురుకుల, మోడల్ పాఠశాలలు, కేజిబివి, గిరిజన తదితర సంక్షేమశాఖల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారినపడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు వంట, డిప్యూటి వార్డెన్లు, స్టాఫ్ నర్సులు, ప్రిన్సిపల్స్ పాల్వంచలోని, రాజీవ్ నగర్ కాలనీ, కెఎస్ఆర్ యంబిఏ కళాశాలలో నిర్వహించు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. 27వ తేదీన వంట వారికి, 28న డిప్యూటి వార్డెన్లకు, 29న స్టాఫ్ నర్సులకు, 30వ తేదీన ప్రన్సిపాల్స్కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహణకు షెడ్యూలు జారీ చేయడం జరిగిందని, ఆయా శాఖల అధికారులు నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం సిబ్బంది హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం సిబ్బంది హాజరు కావాలని, శిక్షణా కార్యక్రమాలకు ఎటువంటి మినహాయింపు లేదని ఆయన స్పష్టం చేశారు.