Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
గడిచిన మూడు రోజుల్లో అక్రమంగా తరులుతున్న 1250 క్వింటాళ్ళు పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పోలీస్‌లు, విజిలెన్స్ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఈ 1250 క్వింటాలు బియ్యం ఉమ్మడి నల్గొండ కరీంనగర్, జిల్లాల నుండి ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి కాకినాడకు యదేచ్చగా తరలిస్తున్నారు. అశ్వారావుపేట తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌కి సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాకు దిక్చూచిగా మారింది. ఈ నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో నాలుగు లారీల్లో ఒక డీసీఎం వాహనంలో సుమారు 1250 క్వింటాల మేరా అంటే 125 టన్నులు రేషన్ బియ్యాన్ని పోలీసులు విజిలెన్స్ అధికారులు సంయుక్త దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో దొరికిన 5 లారీలు ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ రాజమండ్రికి తరలిస్తున్నట్లు తలుస్తుంది. కేవలం దొరికి నవి అయిదు లారీ లైతే దొరక్కుండా అర్ధరాత్రి సమయంలో కొన్ని వేల టన్నులు పీడీఎస్ బియ్యం తరలి పోతున్నాయి అంటూ ఆరోపణ చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో ఎవరి పాత్ర ఎంతో? ఎవరి సహాకారం ఎంతో ఉన్నతాధికారులూ తేల్చనున్నారు. ఈ విషయమై ఎస్ఐ అరుణను సంప్రదించగా స్పందించలేదు. సివిల్ సప్లై డి.టి వెంకటేష్‌ను సంప్రదించగా విచరిస్తున్నామని వివరాలు వెళ్ళడిస్తామనీ అన్నారు.