Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
స్థానిక నిజాంపేట్ యుటీఎఫ్ భవన్లో డీవైఎఫ్ఐ వన్ టౌన్ కమిటీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. డీవైఎఫ్ఐ వన్ టౌన్ అధ్యక్షుడు రావులపాటి నాగరాజు అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ బషీరుద్దీన్, మద్దాల ప్రభాకర్, వన్ టౌన్ సిపిఎం సీనియర్ నాయకులు డాక్టర్ సుబ్బారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో బషీరుద్దీన్ మాట్లాడుతూ. దేశ రక్షణగా యువతి యువత మనోధైర్యంతో పిడికిలి బిగించి ముక్తకంఠంతో ముందడుగు వేయాలని మీకు మేము మన ప్రజాతంత్ర యువజన సమైక్య సంఘం డివైఎఫ్ఐ తోడుగా ఉంటుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వన్ టౌన్ బాధ్యులు కూరపాటి శ్రీనివాస్, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నవీన్, పవన్, డివైఎఫ్ఐ వన్ టౌన్ ఉపాధ్యక్షుడు ధనాలకోట రవికుమార్, వన్ టౌన్ కమిటీ సభ్యులు ఎలగందుల అనిల్ కుమార్, వినరు సాయి, తదితరులు పాల్గొన్నారు.