Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణానికి చెందిన గ్రీన్ సితార్ ఛానెల్ వారు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి నిలువెత్తు రూపం అయినా బతుకమ్మ పండుగ సందర్భంగా చిత్రీకరించిన బతుకమ్మ యూట్యూబ్ పాటను సత్తుపల్లిలోని రింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సోమవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాటను చిత్రించిన, నటించిన టీమ్ జుంజునూరి శ్రీరామమూర్తి, ఇలసారపు మారేష్, కందిమళ్ళ మధు, గరిడేపల్లి వెంకీ, వంకలపాటి రాంబాబు, డైరెక్షన్ కొరియోగ్రఫీ తమ్మిశెట్టి గణేష్, కొప్పుల పవన్ సాయిలను ఎమ్మెల్యే సండ్ర అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణానికి చెందిన కళాకారులు తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయానికి నిలువెత్తు రూపమైన బతుకమ్మ పండుగ పాటను చిత్రీకరించటం అభినందనీమన్నారు. సత్తుపల్లి పట్టణ పేరును వారి కళాపోషణలతో చిత్రాలను చిత్రీకరించడం ద్వారా రాష్ట్రస్థాయిలో పేరు సంతరిస్తుందన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో చిత్రాలు, పాటలను చిత్రీకరించి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. స్థానిక కళాకారులకు ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కొత్తూరు ఉమా, మున్సిపల్ చైర్మెన్ కూసంపూడి మహేశ్, ఏసీపీ వెంకటేశ్, వైస్ చైర్మెన్ తోట సుజలారాణి పాల్గొన్నారు.