Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు
- బహుజన సమాజ్ పార్టీలో భారీ చేరికలు
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం పట్టణం జూబ్లీ క్లబ్ లో బీఎస్పి పార్టీలో బీసీ, ఎస్సీ సభ్యులు చేరారు.ముదిగొండ మండలం, చిరుమర్వి, నామవరం, అమ్మపేట, వల్లపురం గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీల నుండి సుమారు 450 కుటుంబాలు, బి.ఎస్.పి పార్టీ జిల్లా అధ్యక్షులు డా. అల్లిక వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో చేరారు. పార్టీ కండవలు కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీ ఆటంకాల మధ్య వందల కుటుంబాలు, బి.ఎస్.పి పార్టీలో చేరిన వారి త్యాగాలను పట్టుదలను, అల్లిక వెంకటేశ్వర్ రావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజన్ రాజ్యం సాధించాలంటే అది ఒక, బిఎస్పి పార్టీతోనే సాధ్యమన్నారు. జిల్లాలో ఉన్నటువంటి బహుజన్ లందరూ, ఐక్యమై ఖమ్మం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు మెజారిటీతో గెలుచుకొని మన బహుజన్ ఐక్యతను తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సి వీరస్వామి, బిసి సెల్ జిల్లా నాయకుడు చావగాని వెంకట నాగ ప్రసాద్, జిల్లా అడ్వైజర్ మట్టి గురుమూర్తి, ఆలేరు అసెంబ్లీ అధ్యక్ష, ఇన్చార్జులు విన్నబోయిన రమేష్, బుర్ర ఉపేందర్, మధిర అసెంబ్లీ అధ్యక్ష ఇంచార్జ్, శ్రీరాములు పాల్గొన్నారు.