Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షంతో నిలిచిన అటలపోటీలు
నవతెలంగాణ కల్లూరు
స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో 8వ జోనల్ గేమ్స్ రెండోరోజు కొనసాగాయి. సోమవారం జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో పైనల్స్‌లో గెలుపొందిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్యారమ్స్ పోటీలో అండర్ 17 లో కల్లూరు, భద్రాచలం మధ్య జరిగిన కల్లూరు విజేతగా నిలిచింది. అండర్ 19లో నేలకొండపల్లి, పాల్వంచ మధ్య జరిగిన పోటీలో నేలకొండపల్లి విజేతగా నిలిచింది. చెస్ పోటీలో అండర్ 17 లో దానవాయిగూడెం, ఎర్రుపాలెం మధ్య జరిగిన పోటీలో ఎర్రుపాలెం విజేతగా నిలిచింది. బాల్ బ్యాడ్మెంటెన్ అండర్ 17లో మధిర, వైరా మధ్య జరిగిన పోటీిలో మధిర విజేతగా నిలిచింది. అండర్ 19లో వైరా, అంబేద్కర్ కాలేజీ మధ్య జరిగిన పోటీలో వైరా విజేతగా నిలిచింది. అండర్ 19లో 800 మీటర్స్ పరుగు పందెంలో జె.నవ్య ప్రథమ స్థానం, వై.రిపిక ద్వితీయ, సమీర తృతీయ, మధిర, అండర్ 19లో 3 వేల మీటర్లు పందెంలో ఎ.కీర్తి ప్రథమ నేలకొండపల్లి, జి.కృష్ణవేణి ద్వితీయ అంబేద్కర్ కాలేజీ, పి.ప్రవల్లిక తృతీయ వైరా గెలుపొందారు. అండర్ 14 లో డిస్కస్ త్రోబాల్ పోటీల్లో ప్రవల్లిక ప్రథమస్థానం నేలకొండపల్లి, అంజలి ద్వితీయ స్థానం నేలకొండపల్లి, ప్రిని తృతీయ స్థానం దానవాయిగూడెం గెలుపొందారు.
అండర్ 17లో ప్రణతి ప్రథమస్థానం నేలకొండపల్లి అన్షత, ద్వితీయస్థానం వైరా, పవిత్ర తృతీయ స్థానం దానవాయిగూడెం, అండర్ 19లో ఎం.నవ్య ప్రథమస్థానం కల్లూరు, ప్రవల్లిక ద్వితీయస్థానం వైరా, ఎం.సీతామహాలక్ష్మి, తృతీయ స్థానం ములకలపల్లి, అండర్ 17లో 3 వేల మీటర్స్‌లో ఎన్. భువన, ప్రథమ స్థానం ములకలపల్లి, ఎం.అంజలి, ద్వితీయ స్థానం వైరా, డి.త్రిష తృతీయస్థానం నేలకొండపల్లి, అండర్ 14లో 100 మీటర్లు పందెంలో కె సమీరా నేలకొండపల్లి, జే. సుస్మిత కల్లూరు, వై గంగోత్రి నేలకొండపల్లి., అండర్ 17లో ఎన్.సరిత ఇల్లందు, కే. ఉదయభాను కల్లూరు, డీ. త్రిష నేలకొండపల్లి., అండర్ 19లో ఎం.మనీషా వైరా, జె. నవ్య టేకులపల్లి, జీ.కావ్య కల్లూరు గెలుపొందారు. ఈ పోటీలను ఖమ్మం ప్రాంతీయ అధికారి కె ప్రత్యూష, ఎ.ఆర్సి పాషా, ప్రిన్సిపాల్ శ్రీలత పర్యవేక్షించారు.