Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
డైరెక్టర్ ఆఫ్ హెల్త్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారుల ఆదేశానుసారం పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలపై వైద్య శాఖ కొరడా జులిపిస్తోంది. గత వారం రోజులుగా ప్రైవేటు వైద్యశాలలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కొన్ని వైద్యశాల ను సందర్శించారు. కొలిశెట్టి వెంకటేశ్వరావు మెమోరియల్ క్లినిక్, రవి హాస్పిటల్, న్యూ లైఫ్ హాస్పిటల్, జయ క్లినిక్, శ్రీ సాయి క్లినిక్ లను స్సందర్శించారు. ఇందులో కొలిశెట్టి వెంకటేశ్వరా మెమోరియల్‌ని, రవి హాస్పిటల్, శ్రీ సాయి క్లినిక్ లకు తగు సంబంధిత పత్రాలు లేకపోవుట వలన సీజ్ చేశారు. న్యూ లైఫ్ హాస్పిటల్ వారికి తగు ప్రమాణికలను ఏర్పాటు చేసుకోక పోవడం వలన వీరికి షోకాజ్ నోటీసు లను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ చేతన్, ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ఇంచార్జి డాక్టర్ సంధ్యారాణి, ఎపిడిమియాలాజిస్ట్ ఇమ్మానుయేల్, రాంప్రసాద్, భద్రు పాల్గొన్నారు.