Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో రేగాను సుజాతనగర్ మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారద్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. పినపాక నియోజక వర్గంలోని దళిత జర్నలిస్టులకు దళిత బంధు స్కీంకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ వివిధ పత్రికలు, మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.