Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
తమ షాపులు ప్రస్తుతం ఉన్న మార్కెట్లోనే యధావిధిగా ఉంచాలని, తరలింపు చర్యలు అధికారులు ఆపేలా తగు చొరవ చూపి తమను ఆదుకోవాలని కోరుతూ భద్రాచలం కొత్త మార్కెట్ వ్యాపారస్తులు సోమవారం స్థానిక శాసనసభ్యులు పొదెం వీరయ్యకు వినతి పత్రం అందజేశారు. గతంలో పాత మార్కెట్లో ఉన్న తమను, పదేళ్ల క్రితం ఇక్కడికి తరలించారని, మళ్లీ ఇక్కడి నుంచి తొలగిపోవాలని గ్రామపంచాయతీ అధికారులు విన్నవిస్తున్నారని, ఇది ఎక్కడ న్యాయం అంటూ వ్యాపారస్తులు వాపోయారు. కొత్త మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.