Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు నుంచి భద్రాచలాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే
- సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
నవతెలంగాణ-భద్రాచలం
ఇటీవల వచ్చిన గోదారి వరదల్లో భద్రాచలం పట్టణం పూర్తిగా ముంపునకు గురైనదని దీనివలన ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అట్టి వారందరికీ ప్రభుత్వం కరకట్టను పటిష్ట పరిచి శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ(ఎం) పొలిటి బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేసారు. భద్రాచలంలో సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే పేరుతో ప్రజలను గందర గోళ పరచవద్దని అన్నారు. భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ఏరియా, ఏఎంసీ కాలనీ, చప్తా దిగువ, శాంతి నగర్ కాలనీలు అన్ని పూర్తిగా ముంపుకు గురైనాయని వారికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ముప్పు నుండి ప్రజలను కాపాడాలని అన్నారు. గోదావరి కరకట్టను ఎత్తు పెంచి, పొడిగించి పటిష్ట పరచడం ద్వారా ముంపు నుంచి భద్రాచలం పట్టణాన్ని రక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ మిడియం బాబురావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, పట్టణ కార్యదర్శవర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వైవీ రామారావు, పట్టణ కమిటీ సభ్యులు ఎన్ నాగరాజు, జి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.