Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు గత 18 రోజులుగా సమ్మె చేస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేసి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం సీఎంఓకి, రుద్రంపూర్‌లోని పివికే. మేనేజర్ పాలడుగు శ్రీనివాస్ రావుకి, జికే-ఓసి, సత్తుపల్లి కిష్టారం ఓసి. మేనేజర్లకు వివిధ మైన్స్, డిపార్ట్మెంట్స్ సంబంధిత అధికారులకు ద్వారా సీఅండ్ ఎండికి పంపించాలని వినతి పత్రాన్ని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, విజయగిరి శ్రీనివాస్ అందజేశారు. ఇందులో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని 26వ తేదీన జరుగుతున్న చర్చల్లో వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజుల రాజారావు, వై.వెంకటేశ్వరరావు, కర్ల వీరాస్వామి, ఎలగొండ శ్రీరామూర్తి, బి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.