Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తనిఖీల నుండి బయట పడేందుకు తంటాలు
- షోకాజ్ నోటీసులతో సరిపుచ్చిన అధికారులు
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్రంలోనే నకిలీ ఆసుపత్రులు, వైద్యుల భరతం పట్టేందుకు ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తుంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 400 ఆసుపత్రులు ఉండగా 177 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. మిగిలిన 233 ఆసుపత్రుల్లో తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్ల బృందం ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిినట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పోల్యూషన్ ధృవీకరణ పత్రం, అగ్నిమాపక ధృవీకరణ పత్రం, అర్హత కలిగిన వైద్య సిబ్బంది, అనుమతులు, తదితర అనుమతులు కలిగి ఉండాలి. ల్యాబ్‌లలో కాలం చెల్లిన రసాయనాలు వాడరాదు. ఇవి లేని ఆసుపత్రులకు, ల్యాబ్‌లకు షోకాస్ నోటీసులు అందజేస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రి బోర్డులో ఉన్న డిగ్రీలు డాక్టర్లకు లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో భద్రాచలం, టేకులపల్లిలో అర్హత లేని డాక్టర్లు అబార్షన్ చేయడంతో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. కరకగూడెం మండలంలో డాక్టర్లు తెలియని వైద్యం చేయడంతో వైద్యం వికటించి పసికందు ప్రాణాలు విడిచాడు. గత రెండు రోజులుగా జిల్లా వైద్యాదికారుల బృందం డాక్టర్ శ్రీనివాసరావు, గొంది వెంకటేశ్వర్లు, విజరుకుమార్, ముత్యాలరావుల ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుండగా అనుతులు లేని ఆసుపత్రు చిట్టా బయటపడింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మణుగూరులో 14 ప్రైవేట్ ఆసుపత్రులకు గాను 13 ఆసుపత్రులు నిబంధ నలకు విరుద్దంగా ఉన్నాయని షోకాస్ నోటీసులు అందజే శారు. ఆసుపత్రిలలో ల్యాబ్, మెడికల్ షాప్, డాక్టర్, కలిగి ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. అనుమతులు లేని రెండు ల్యాబ్ లను సీజ్ చేశారు. షోకాజ్ నోటీసులు అందజేసిన ఆసు పత్రుల డాక్టర్లు ఆసుపత్రిని తెరవకుండా ఎప్పుడు దాడి చేస్తా రనే భయంతో మూతవేసి ఉంచుతున్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విషజ్వరాలకు పరీక్ష చేసే టెక్నిషీయన్, సదుపాయాలు లేని కారణంగా గత కొంత కాలంగా ప్రజలందరూ ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్ధికంగా నష్టపోయారు. షోకాజ్ నోటీసులకే పరిమితం కాకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.