Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేనిపక్షంలో భవిష్యత్తు ఎన్నికలు బహిష్కరిస్తాం
- విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడుకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని లేని పక్షంలో భవిషత్తు ఎన్నికలను బహిష్కరిస్తామని జేఏసీ కన్వీనర్ కెవి రమణ, ప్రధాన కార్యదర్శి దామర శీనులు అన్నారు. సోమవారం బూర్గంపాడులోని ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముంపునకు గురవుతున్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో 120కిలోమీటర్ల వరకు కరకట్ట నిర్మించనున్నట్లు, విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. కరకట్ట నిర్మాణంతో పాటు 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వర్తకసంఘం అధ్యక్షులు డా.విష్ణువర్ధన్, గూడురు వెంకన్న, హరిప్రసాద్, రాయల వెంకటేశ్వర్లు, ఆరీఫ్, లక్ష్మీణ్ పాల్గొన్నారు. అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు సోమవారం 39వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఆజీజబేగం, నబాబి, రహీమున్నీషా, స్నేహలత, సంధ్యా రాణి, దర్యాబి, విజయలక్ష్మీ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.