Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచుతూ కొత్త జీవో విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ...మండలంలో వ్యకాస ఆధ్వర్యంలో గ్రామాలలో కూలీలతో విస్తృతంగా జనరల్ బాడీ సమావేశాలు జరిపామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కూలీలకు ఇస్తున్న కూలి రేట్లు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రకారం పెంచాలని అన్నారు. వ్యవసాయ కూలీలకు, అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కారం పుల్లయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వజ్జ సురేష్, సరియం కోటేశ్వరరావు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, ముదిగొండ రాంబాబు, సహాయ కార్యదర్శులు యాసా నరేష్, ఆలేటి కిరణ్, మర్మం చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.