Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర క్రీడల నోడల్ అధికారి శేషు కుమారి
- కోలాహలంగా 8వ జోనల్ మీట్ క్రీడలు
- బహుమతులు అందుకున్న విజేతలు
నవతెలంగాణ-పాల్వంచ
క్రీడల ద్వారా పోరాడే తత్వం అలబడుతుందని సొసైటీ రాష్ట్ర క్రీడల నోడల్ అధికారి శేషు కుమారి అన్నారు. పాల్వంచలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో బాలుర విభాగంలో జరుగుతున్న ఎనిమిదవ జోనల్ మీట్ క్రీడలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఈ క్రీడలకు వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. రెండో రోజు సోమవారం ఆమె హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు స్నేహభావం పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్ర మంలో ఖమ్మం రీజియన్ సమన్వయ అధికారి కె.ప్ర త్యూష, ఏఆర్సీఓ ఎస్ కే పాషా, ఖమ్మం రీజియన్స్ స్పోర్ట్స్ అధికారి వీరస్వామి, జోనల్ మీట్ టోర్నమెంట్ ఇన్చార్జ్ వెంకటరెడ్డి, ఖమ్మం రీజియన్ ప్రిన్సిపాల్ పీడీ పీఈటీలు పాల్వంచ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
జోనల్ క్రీడల విజేతలు వీరే
షార్ట్ పుట్ అండర్ 17లో మొదటి స్థానం అంకిరెడ్డిపల్లి, రెండవ స్థానం ఏ.రాము తిరుమలేయపాలెం, మూడవ స్థానం కే.మహేష్ వర్ధన్నపేట్, అండర్ 14లో మొదటి స్థానం కె.ఆనంద్ అంకిరెడ్డిపల్లి, రెండవ స్థానం ఎన్.రామ్ చరణ్ నర్సంపేట్, మూడవ స్థానం పి.జస్వంత్ మరిపెడ, హై జంప్ అండర్ 19లో మొదటి స్థానం రితీష్ దమ్మపేట, రెండవ స్థానం టి.చందు దమ్మపేట, మూడవ స్థానం బాలాజీ అంకిరెడ్డిపల్లి, అండర్ 17 మొదటి స్థానం ఆర్.కిరణ్ అంకిరెడ్డిపల్లి, రెండవ స్థానం ఎం.శ్రీధర్ దమ్మపేట, మూడవ స్థానం సంతోష్ పాల్వంచ, అండర్ 14 మొదటి స్థానం టీ.కార్తిక్ పాల్వంచ, రెండవ స్థానం టీ.విశ్వాస్ తిరుమలాయపాలెం, మూడవ స్థానం ఎం.సందీప్ దమ్మపేట, 400 మీటర్ల పరుగు పందెంలో అండర్ 19 మొదటి స్థానం సిహెచ్ రవికుమార్ దమ్మపేట, రెండవ స్థానం ఎన్.సాయి అంకిరెడ్డిపల్లి, మూడవ స్థానం బి.నాగరాజు పాల్వంచ, అండర్ 17 మొదటి స్థానం బి.లోకేష్ మణుగూరు, రెండవ స్థానం జి.రాఘవ పరకాల, మూడవ స్థానం దమ్మపేట, అండర్ 14 మొదటి స్థానం టీ.మహేష్ మరిపెడ, రెండవ స్థానం బి.జస్వంత్ మరిపెడ, మూడో స్థానం ఎం.శ్రీధర్ పాల్వంచ, 500 మీటర్ల పరుగు పందెంలో అండర్ 19 మొదటి స్థానం సిహెచ్ రవికుమార్ దమ్మపేట, రెండవ స్థానం వివేక్ అంకిరెడ్డిపల్లి, 3వ స్థానం దినేష్ దమ్మపేట, అండర్ 17 మొదటి స్థానం బి.అభిషేక్ దమ్మపేట, రెండవ స్థానం బి.నిర్మల రాజు ముదిగొండ, మూడవ స్థానం డి.ప్రవీణ్ కుమార్ దమ్మపేట, లాంగ్ జంప్ అండర్ 17 మొదటి స్థానం బి.విక్రం అంకిరెడ్డిపల్లి, రెండవ స్థానం డి.సందీప్ మూడవ స్థానం, పి.నరేందర్ వర్ధన్నపేట విజేతలుగా నిలిచారు.