Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ హాస్పిటల్స్, ల్యాబ్ యాజమాన్యాలకు హెచ్చరిక
- 11 కేంద్రాలను పరిశీలన...5 కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ
- డీఐఓ డాక్టర్ జె.నాగేంద్ర ప్రసాద్
నవతెలంగాణ-అశ్వారావుపేట
వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్‌లలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. వారంలో రెండో సారి మండలంలో పలు ఆసుపత్రులు, రక్తపరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యాధి నిరోధకటీకాల అధికారి డాక్టర్ జె.నాగేంద్రప్రసాద్ హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ దయానందస్వామి ఆదేశాల మేరకు డీఐఓ డాక్టర్ నాగేంద్రప్రసాద్ బృందం సోమవారం పలు ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్ లను విస్తతంగా తనిఖీలు నిర్వహించారు.ఇందులో భాగంగా 11 కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు పట్టణంలోని జీవన శ్రీ హాస్పిటల్, వందన నర్సింగ్ హౌమ్, ఆదిత్య హాస్పిటల్, సాగర్ ల్యాబ్, శ్రీదేవి ల్యాబ్ వంటి 5 కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి 6 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. సంతృప్తికర వివరణ ఇవ్వలేని పక్షంలో వాటిని సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు హాస్పిటల్స్, ల్యాబ్‌లు నిబంధనలను అతిక్రమించిన, విరుద్ధంగా వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అనుమతులు లేకుండా వైద్యం చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ నాగభూషణం, హెచ్ఈఓ రమణారెడ్డి, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పినపాక, కరకగూడెం మండలాల్లో అనుమతులు లేని ఆసుపత్రులు
మణుగూరు/కరకగూడెం : రాష్ట్రంలో నకీలీ డాక్టర్లు ,ఆసుపత్రులను గుర్తించేందుకు కొనసాగుతున్న తనిఖీలు సోమవారం కూడా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక మండలాల్లో విస్తృతంగా నిర్వహించారు. అనేక ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా రక్తపరీక్ష కేంద్రాలలో అనుమతులు లేని కారణంగా శ్రీరామ్ ఆసుపత్రి, రక్తపరీక్షా కేంద్రాన్ని మూసివే స్తున్నట్లు జిల్లా వైధ్యాధికారి డాక్టర్ శ్రీనీవాస్ తెలిపారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడు తూ అనుమతులు లేని కారణంగా వంద శాతం ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు అందజేశా మన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా సహాయ అధికారి గొంది వెంకటేశ్వర్లు, సబ్ యూనిట్ ఆఫీసర్ లింగ్యానాయక్, తదితరులు పాల్గోన్నారు.
దమ్మపేట : జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి సూచన మేరకు సోమవారం దమ్మపేట నందు గల ప్రైవేట్ ఆసుపత్రులైన ఆర్తి కృష్ణ నర్సింగ్ హౌమ్, అండ్ లాబరేటరీ, భవాని నర్సింగ్ హౌమ్, అండ్ లాబరేటరీ, గోపి దియాగ్నోసిస్లను డా.నాగేంద్రప్రసాద్ (భద్రాద్రి జిల్లా ఇమ్మునైజషన్ ప్రోగ్రామ్ అధికారి) ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జిల్లా అధికారితో పాటు సీహెచ్ఓ నాగభూషణం, హెచ్ఈ రమణారెడ్డి, హెచ్ఈఓ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.