Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- ఐలమ్మ నుంచే సాయుధ పొరాటానికి నాంధి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య
- గంగారంలో ఐలమ్మ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ- సత్తుపల్లి
పెత్తందారీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ అని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవార సత్తుపల్లి మండలం గంగారంలో వీరభద్ర రజకసంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సండ్ర మాట్లాడుతూ ఐలమ్మకు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు అండగా నిలవడమే గాక ప్రత్యక్ష పోరాటాలను ఐలమ్మ నేతృత్వంలో ఉధృతంగా సాగాయన్నారు. భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను ఐలమ్మ నేతృత్వంలో పేదలకు పంపిణీ జరిగిందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘ గౌరవాధ్యక్షుడు పి.సోమయ్య మాట్లాడుతూ ఐలమ్మ ఇంటినుంచే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంధి జరిగిందని, అక్కడ మొదలైన పోరాటం నిజాం నవాబును గద్దె దించేవరకు సాగిందన్నారు. ఐలమ్మ పుట్టిపెరిగిన జిల్లా జనగామకు ఐలమ్మ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరభద్ర రజకసంఘం అధ్యక్షుడు ఫల్గుణుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి (చిట్టినాయన), రజకసంఘ నాయకులు తమ్మారపు బ్రహ్మయ్య, నిమ్మటూరి రామకృష్ణ, రాయల సత్యనారాయణ, గంగారం సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కర్నాటి వెంకటరావు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాదిరాజు వాసుదేవరావు, సీపీఐ( ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్, బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాసరావు, ఎంవీఐ వెంకటపుల్లయ్య, పున్నం రాంబాబు, బెల్లంకొండ రాము పాల్గొన్నారు.
ఖమ్మం : చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య, పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు పాషా తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం : ఎంపీ నామ
ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి : సామాన్యుల కోసం పెత్తందారీ వ్యవస్థపై సమరశంఖం పూరించిన వీర నారి చిట్యాల ఐలమ్మ అని టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కొనియాడారు. ఐలమ్మ జయంతి సందర్భంగా నామ సోమవారం ఆమెకు ఘనంగా నివాళులు అర్పించి, ఆమె త్యాగ నిరతిని ప్రశంసించారు. పేద ప్రజలను కాపాడేందుకు ఆమె చేసిన పోరాటాలను చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని అన్నారు.
కారేపల్లి : తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కారేపల్లిలో నిర్వహించారు. మలిదశ ఉద్యమకారుడు జూపల్లి రామును నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వైరా ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ అజ్మీర నాగేశ్వరారవు, సోసైటీ, మార్కెట్ కమిటీ డైరక్టర్లు పాల్గొన్నారు.
ధీరవనిత చాకలి ఐలమ్మ : కలెక్టర్, సీపీ
ఖమ్మం : ధీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని ధర్నాచౌక్‌లో ఐలమ్మ విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదనరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, బిసి వెల్ఫేర్ ఈడీ జ్యోతి, నాయకులు జక్కుల లక్ష్మయ్య పాల్గొన్నారు.
బోనకల్ : బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి ఆ గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, పంచాయతీ కార్యదర్శి దామల్ల కిరణ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గోవిందా పురం ఏ, పెద్ద బీరవల్లి, చోప్పకట్లపాలెం, ముష్టికుంట్ల, తూటికుంట్ల తదితర గ్రామాలలో ఐలమ్మ జయంతి వేడుకలను గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వైరాటౌన్ : వైరా పట్టణ రజక సంఘం అధ్యక్షుడు ఏదునూరి శ్రీను ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైరా పట్టణ రజక సంఘం నాయకులు ఏదునూరి చిన్నవెంకన్న, జోగినిపల్లి వెంకన్న, ఏదునూరి చిన్న కోటయ్య, రేమల్లి కోటేశ్వరరావు, ఏదునూరి చిన్న శ్రీను, బాసటీ రామారావు, రేగళ్ళ వీరభద్రరావు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : తెలంగాణ వీర వనిత చిట్యాల ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా మనమంతా కృషి చేయాలని ఎంపీపీ దేవరకొండ శిరీష పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు, చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పంబి సాంబశివరావు, వైస్ ఎంపీపీ సూరనేని కోటేశ్వరావు, భాగం వేణు, ఎంపీటీసీ షేక్ మస్తాన్ వలి, ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్ బాబు, సర్పంచ్‌లు చెన్నం పురుషోత్తమ రాజు, మొగిలి అప్పారావు, యువజన అధ్యక్షులు కొండపాటి సాంబశివరావు పాల్గొన్నారు.
ఖమ్మం: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య, ఖమ్మం నగర అధ్యక్షులు వడ్డేం విజరు, నగర నాయకులు చండ్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి : వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలని డిసిసిబి డైరెక్టర్, కామేపల్లి మాజీ జెడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్ తెలిపారు. పండితాపురం గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, అరిపిన్ని అశోక్, చింతల వెంకటేశ్వర్లు, మేకల లక్ష్మీనారాయణ, అల్లిక బక్కయ్య, చిట్టిబాబు, కమలమ్మ, చుక్కమ్మ పాల్గొన్నారు.
సత్తుపల్లిరూరల్ : మండల పరిధిలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియం బి.గంగారం నందు చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కమాండెంట్ సయ్యద్ జమీల్ భాషా, అదనపు దళాధిపతి ఏ.అంజయ్య, జె.లెనిన్‌బాబు, ఆర్ఐ కె.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ పోరాటంలో దొరలను గడగడలాడించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మని ఎంపీపీ సామినేని హరిప్రసాద్ అన్నారు. ఐలమ్మ జయంతిని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పిటిసి పసుపులేటి దుర్గ, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, ఎంపీఓ పి.సూర్యనారాయణ, నేలకొండపల్లి ఏఎంసి మాజీ డైరెక్టర్ బంక మల్లయ్య, సామాజిక ఉద్యమకారులు దేవపొంగు వెంకటేశ్వర్లు, పులిపాటి ప్రకాష్ పాల్గొన్నారు.
పెనుబల్లి : వియంబంజర్లో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన నాయకులు బెజవాడ సాయి శేషు, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు పంతంగి వెంకటేశ్వరరావు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, నీలాద్రి ఆలయ కమిటీ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, భూక్యా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .
మధిర : మధిర పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తల్లాడ : మహిళా చైతన్యానికి ఐలమ్మ మార్గదర్శకురాలని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారు ఐలమ్మ జయంతి సందర్భంగా పినపాక గ్రామంలో ఆమె విగ్రహానికి ఎంపీపీ పూలమాలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు వెంకట్, సొసైటీ సభ్యుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఎంపీపీ డి.శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు.
సత్తుపల్లి : చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు సత్తుపల్లి పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ధోబీ ఘాట్‌లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఎస్కే రఫీ, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు మందపాటి పద్మజ్యోతి పాల్గొన్నారు.
బీసీ సంఘం ఆధ్వర్యంలో....
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో ఐలమ్మ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్, డాక్టర్ మట్టా దయానంద్ విజరుకుమార్, రజక సంఘం రాష్ట్ర నాయకులు తెలగారపు అప్పారావు, ఉద్యోగ సంఘాల నాయకులు చిత్తలూరి ప్రసాద్, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తిన్నవెల్లి రంగారావు, మండల అధ్యక్షులు పామర్తి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు విరివాడ నాగభూషణం పాల్గొన్నారు.
నేలకొండపల్లి : వీర తెలంగాణ రైతన్న సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను నేటి యువత, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సై జి స్రవంతి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని బీసీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంఘం పాలేరు నియోజకవర్గం కన్వీనర్ పాగర్తి సుధాకర్, ఎంపీటీసీ సీలం వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు మారిసెట్టి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు జర్రిపోతుల అంజని, దేవరశెట్టి రాము, పగిడిపల్లి అజరు, టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షులు కాసాని నాగేశ్వరరావు, రజక సంఘం మండల అధ్యక్షుడు గడ్డం రామారావు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ముదిగొండ : మేడేపల్లి, ముదిగొండ, చిరుమర్రి, గంధసిరి తదితర గ్రామాలలో తెలంగాణ వీర వనిత చిట్యాల ఐలమ్మ జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, మేడేపల్లి గ్రామసర్పంచ్ సామినేని రమేష్, చిరుమర్రి ఉపసర్పంచ్ వినుకొండ రమేష్, గంధసిరి సర్పంచ్ రాజుల సీతమ్మకోటయ్య ఉపసర్పంచ్ రాఘవరెడ్డి, రజక సంఘం జిల్లా నాయకులు గొల్లపల్లి హుస్సేన్, పురిమెట్ల భూసి, గొల్లపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : మండల కేంద్రంలో ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా చిట్యాల ఐలమ్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాణోత్ జయరాం నాయక్, ఎంపిఓ రాజేశ్వరి, సూపరింటెండెంట్ నజీర్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గుగ్గీళ్ళ అంబేద్కర్, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.