Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాయలం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తెలిపారు. మంగళవారం రైటర్బస్తి, ఎల్ఐసి కార్యాలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత బలమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు పార్టీని గుండెల్లో పెట్టుకొని రెండుసార్లు అధికారం కట్టబెట్టారన్నారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అందజేస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్, ఇల్లందు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్.రాజు, టిఆర్ఎస్వి జిల్లా కో-ఆర్డినేటర్ సంకు బాపన అనుదీప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వట్టం రాంబాబు, అన్వర్, మింట కంటి సురేందర్ రెడ్డి, ఎంటెక్ మహేందర్, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.