Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
వచ్చే నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభలకు వేలాదిగా తరలిరావాలని జిల్లా సహాయ కార్యదర్శి రావులపల్లి రాంప్రసాద్, మండల కార్యాలయంలో జరిగిన మండల సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు, మండల సహాయ కార్యదర్శిలు ధర్మ, సాయి, డి.లక్ష్మీనారాయణ, శివన్నారాయణ, విజయలక్ష్మి, శాంతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని, ప్రజా సమస్యల పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ విమర్శించారు. మంగళవారం సిపిఐ కౌన్సిల్ సమావేశం సిరిపురపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా చండ్ర నరేంద్ర కుమార్, మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎల్లంకి మధు, షేక్ నాగుల్ మీరా, చింత స్వరాజరావు, వీరభద్రం, ఎస్కే చాంద్ పాషా, వెంకటేశ్వర్లు, ముత్తయ్య, సీతయ్య, సామేలు, కోటయ్య పాల్గొన్నారు.