Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -దుమ్ముగూడెం
ప్రజారోగ్యం, ఏజెన్సీ ప్రాంత మారుమూల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే దేయంగా తెలంగాణ పోలీస్ శక్తి వంచన లేకుండా పని చేస్తుందని భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని మారుమూల గుత్తి కోయ గ్రామం ములకనాపల్లిలో దుమ్ముగూడెం పోలీసులు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్య చికిత్సలు చేసి వారికి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం ఏఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా గ్రామంలోని చదువుకునే పిల్లలకు పుస్తకాలు, పెన్నులను అందజేసి, మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం జిల్లా ఎస్పీ వినీత్ జి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీఐ దోమల రమేష్, ఎస్సైలు రవి, కేశవ, వైద్యులు చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు.