Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారదర్శకంగా ప్రశ్న అడగాలి... సమాధానం పొందాలి
- చట్టం దుర్వినియోగానికి తావు లేకుండా చూస్తున్నాం
- స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శంకర్ నాయక్
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాచార హక్కుచట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారాన్ని సెక్ష్టన్ 7(1) ప్రకారం 30 రోజులో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల పీఐఓ అధికారులపై ఉందని, సమాచార హక్కు పౌర సమాజం కోసం ఉపయోగపడాలని, పారదర్శకంగా ప్రశలు ఉండాలని, పారదర్శకంగా సమాదానం పొందాలని, సమాచార హక్కు చట్టం దుర్వినియోగానికి పాల్పడకుండా చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నందు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగిన పౌరులకు, పౌర సమాచార అధికారులతో 35 కేసులు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచారహక్కు చట్టం విధులు, పరిధిపై మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాలని తెలిపారు. అలా సకాలంలో సమాచారం ఇవ్వని కారణంగా కమిషన్ నేరుగా ప్రజలు, ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో ఇవాళ జిల్లా కలెక్టరేట్లో కేసులను విచారణ ప్రక్రియ నిర్వహించి కోరిన సమాచారాన్ని అందచేసినట్లు చెప్పారు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం రాకపోత మొదటి అప్పీల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది అని చెప్పారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని సందర్భంగా 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి ఆపరేటర్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పిలేట్ అథారిటి సమస్య పరిష్కరించాలని చెప్పారు. అప్పిలేట్ అథారిటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టని పక్షంలో సెక్షన్ 19 (3) ప్రకారం కమిషన్‌కి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మంగళవారం జిల్లాకు సంబంధించిన 35 కేసుల విచారణ నిర్వహించి దరఖాస్తు దారులకు కోరిన సమాచారం అందచేసినట్లు చెప్పారు. పౌరులకు సమాచారం అందచేయడంలో రాష్ట్ర కమిషన్ సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతూ ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. అలాగే పౌర సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీలుగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లాలో 500 పై చిలుకు కేసులు పరిష్కరించినట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు అటవీ, విద్యాశాఖలకు సంబంధించి ఎక్కువ కేసులు వస్తున్నాయని ఆయన వివరించారు. సమాచార హక్కు చట్టంలో ఉన్న సెక్షన్లు ప్రజలకు తెలియచేయాలని కోరారు. చైతన్య వంతులు మాత్రమే చట్టాన్ని వినియోగించుకుంటున్నారని, తెలియనివాళ్లు చాలా మంది ఉన్నారని అటువారందరూ కమిషన్ విధులు తెలియచేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందుగా జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు మొక్కను అందజేసి స్వాగతం పలికారు.