Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు అందజేస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా హామీ ఇచ్చారు. మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును పలువురు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా ఏర్పాటు చేసిన దళిత బంధు పథకాన్ని ఈ నియోజకవర్గానికి కేటాయించిన 500 యూనిట్లలో 10 శాతం యూనిట్లు దళిత జర్నలిస్టులైన స్థానికులకు కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం మొదటి దఫాలో 20 మందికి ఇస్తానని, మిగిలిన వారికి జనవరిలో కేటాయిస్తామని స్పష్టమైనహామీ ఇచ్చారు. 20 యూనిట్లను జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న దళిత జర్నలిస్టులకు కేటాయిస్తానని హామీ ఇచారు. అనంతరం జర్నలిస్టుల బృందం ఎమ్యెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇమంది ఉదరుకుమార్, ఏర్పుల సుధాకర్ రావు, దాసరి వెంకటేశ్వర్లు, ఎర్ర ఈశ్వర్, చీమకుర్తి రామకృష్ణ, పురం శ్రీనివాస్, సైదులు, జల్ది శ్యామ్, గుణ సురేష్, కొండ జంపన్న, చదలవాడ సూరి, రాజకుమార్, బాలకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.