Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండలంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య, ఉపసర్పంచ్ భూక్య చందులాల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : ప్రముఖ తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి మంగళవారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు స్థానిక ఎంపీపీ శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, ఉట్లపల్లి, మల్లాయిగూడెం సర్పంచ్లు అట్టం రమ్య, సాదు జ్యోత్స్నాబారు, నారం రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ పాల్గొన్నారు.
వ్యవసాయ కళాశాలలో : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవాలను స్థానిక వ్యవసాయ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.మాధవి అధ్యక్షత వహించి తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాన్ని విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది డాక్టర్లు వి.వెంకన్న, కె.గోపాల కృష్ణ మూర్తి, కె.నాగాంజలి, పి.నీలిమ, ఆముక్త మాల్యద, పాలనా అధికారి జయమ్మ, విద్యార్థిని విద్యార్థులు పాలుగొన్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ సేవ పధకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఆర్.రమేష్, కడ సిద్దప్ప సమన్వయ పరిచారు.
ఇల్లందు : స్థానిక గ్రంధాలయంలో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రంధాలయంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, పులిగళ్ళ మాధవరావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జూలూరుపాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో వైరా శాసన సభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదేశాల మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకట రెడ్డి , రైతు బంధు కన్వీనర్ వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి నున్నా రంగారావు, వెంగన్నపాలెం సర్పంచ్ గలిగే సావిత్రి, ఎంపీటీసీ దుద్దుకురి మధుసూదన్ రావు, ఉపాధ్యక్షుడు ఎస్కే మైబు, తదితరులు పాల్గొన్నారు.
దళిత జర్నలిస్టులకు దళితబంధు ఇవ్వాలి
- టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వనమాకు వినతి
కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా పాత్రికేయులుగా పనిచేస్తున్న దళిత జర్నలిస్టులకు దళిత బంధును మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజె టీజెఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. మంగళవారం ఎమ్మెల్యే వనమాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం తనవంతుగా దళితబంధు అందేలా కృషిచేస్తానన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు చండ్ర నరసింహారావు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, షఫీ, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.