Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-మణుగూరు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారన్నారు. ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ 2018 ఎన్నికల మ్యానిఫె˜స్టోలో కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే తానే ఫ్యాక్టరీని పెడతానని కేసిఆర్ చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం లేదో సరైనా సమాధానం చెప్పకపోవడం విచారకరమన్నారు. ముడి సరుకు బయ్యారం ప్రాంతంలో పుష్కలంగా ఉందన్నారు. కిషన్‌రెడ్డికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై సరైనా అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తన్నుకుపోతున్నారని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటు చేయకపోతే కేసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు ,తదితరులు పాల్గోన్నారు.