Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 8వ జోనల్ గేమ్స్ మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 25న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 14 గురుకుల పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు జోనల్ గేమ్స్ ప్రారంభించారు. 3 రోజులుగా ఆటల పోటీల్లో నిర్వహించి ప్రతిభ కనపరిచిన వారిని విజేతులుగా ఖమ్మం ప్రాంతీయ అధికారి ప్రత్యూష ప్రకటించారు. కబడ్డీ విబాగంలో అండర్ 14లో ముల్కలపల్లి టీమ్ ప్రథమ స్థానం, అడవి మల్లెల ద్వితీయ స్థానం నిలిచింది. అండర్ 17లో ముల్కలపల్లి ప్రథమ స్థానంలో నిలవగా అడవిమల్లెల రెండో స్థానంలో నిలిచింది. అండర్ 19లో కల్లూరు టీమ్ ప్రథమ స్థానంలో నిలవగా నేలకొండపల్లి టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఖోఖోలో అండర్ 14లో టేకులపల్లి టీమ్ ప్రథమ స్థానంలో నిలవగా, భద్రాచలం ద్వితీయ స్థానంలో నిలిచింది. అండర్ 17లో కల్లూరు టీమ్ ప్రథమ స్థానంలో నిలవగా, కూసుమంచి టీమ్ రెండో స్థానంలో నిలిచింది. 19లో అంబేద్కర్ కాలేజీ టీమ్ ప్రథమ స్థానం, నేలకొండపల్లి టీమ్ రెండో స్థానంలో నిలిచింది. వాలీబాల్‌లో అండర్ 17లో కల్లూరు టీమ్ ప్రథమ స్థానంలో నిలవగా, 19లో టేకులపల్లి టీమ్ ప్రథమ స్థానం, వైరా టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. హ్యాండ్‌బాల్‌లో అండర్ 17లో వైరా టీమ్ ప్రథమ స్థానం, టేకులపల్లి ద్వితీయ స్థానంలో నిలిచింది. 19లో వైరా టీమ్ ప్రథమ స్థానం, అంబేద్కర్ కాలేజీ ద్వితీయ స్థానంలో నిలిచింది. బాల్ బ్యాడ్మింటన్‌లో అండర్ 17లో మధిర టీమ్ ప్రథమ స్థానంలో నిలవగా, వైరా టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. 19లో వైరా టీమ్ ప్రథమ స్థానంలో నిలవగా, అంబేడ్కర్ కాలేజీ టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. టెన్నిక్యాడ్ డబుల్స్‌లో అండర్ 14లో కూసుమంచి ప్రథమ స్థానం, దానవాయిగూడెం టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. 17లో కుసుమంచి టీమ్ ప్రథమ స్థానం, నేలకొండపల్లి టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. అండర్ 19లో వైరా టీమ్ ప్రథమ స్థానంలో నిలవగా, టేకులపల్లి టిమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. చెస్ సింగిల్స్ అండర్ 14లో భద్రాచలం ప్రథమ స్థానం, అడివి మల్లెల ద్వితీయ స్థానంలో నిలిచింది. 17లో ఎర్రుపాలెం ప్రథమ స్థానంలో నిలవగా, దానవాయిగూడెం ద్వితీయ స్థానంలో నిలిచింది, క్యారమ్స్ డబుల్స్‌లో 14 లో కల్లూరు ప్రథమ స్థానం, ములకలపల్లి ద్వితీయ స్థానంలో నిలిచింది, 17లో కల్లూరు ప్రథమ స్థానం, భద్రాచలం ద్వితీయ స్థానంలో నిలిచింది, 19 లో నేలకొండపల్లి ప్రథమ స్థానంలో నిలవగా ,పాల్వంచ ద్వితీయ స్థానంలో నిలిచింది, వరల్డ్ చాంపియన్ షిప్లో ముల్కలపల్లి, భద్రాచలం పదిహేను పాయింట్లు రాగా, కల్లూరు 30 పాయింట్లు, అంబేద్కర్ కాలేజీ, టేకులపల్లి, 25 పాయింట్లు సాధించారని వారు తెలిపారు. ఈ ఆటల పోటీలు నిర్వహించటానికి పీఈటీలు కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
సబ్ జూనియర్ ఖోఖో క్రీడాకారులకు దుస్తులు వితరణ
ఖమ్మం జిల్లా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా జట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో సబ్ జూనియర్ పోటీలలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు 12 వేలు విలువగల క్రీడా దుస్తులను గూడూరు కోటిరెడ్డి అందించారు. మంగళవారం లంచ్ ఏర్పాటు చేసినటువంటి సత్యసాయి సేవా సమితి ఖమ్మం సుధాకర రామారావుకి ఖమ్మం జిల్లా ఖోఖో అసోసియేషన్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోపుడు బండే ఫౌండేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే సాదిక్ అలీ, ఖమ్మం జిల్లా ఖోఖో అసోసియేషన్ బాధ్యులు ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీర రాఘవయ్య, కోశాధికారి సిహెచ్ శ్రీహరి, జాయింట్ సెక్రటరీ పి.నరసయ్య, అసోసియేషన్ బాధ్యులు తల్లపురెడ్డి గౌతమ్ రెడ్డి ఎన్. వెంకటేశ్వర్లు, ప్రసాద్, పవన్ కుమార్, వెంకటేష్, గోపి, సత్యనారాయణ రెడ్డి, ముఖ్య అతిథిగా ఖమ్మం అథ్లెటిక్ చీఫ్ కోచ్ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఖోఖో అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.