Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడడమే ఎంపీజే ముఖ్య ఉద్దేశమని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఖమ్మం ఎంపిజే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, దళిత, గిరిజన, బంధు తరహాలోనే ముస్లిం బందును కూడా ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రత్యేకంగా ముస్లిం సబ్ ప్లాన్ అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిమ్ మాట్లాడుతూ.. ఎంపిజే లక్ష్యం సమాజ సంక్షేమం, శాంతి, న్యాయం నెలకొల్పడం, దేశం నుండి పేదరికం, అజ్ఞానం, మతవివక్ష, పరస్పర విద్వేషాలను పారద్రోలడం, మానవ హక్కులను కాపాడడం, మహిళా హక్కులను పరిరక్షించడం, పిల్లల మరియు బలహీన వర్గాలకు రాజ్యాంగ హక్కులు కల్పించడం తదితరమైనవి అన్నారు. శాంతి, న్యాయం కోసం పోరాడుతూ రాజకీయేతర, ప్రభుత్వేతర సామాజిక సంస్థ. దేశంలో శాంతిని, న్యాయాన్ని పెంపొందించడం కోసం, కులమతాల కతీతంగా అన్ని వర్గాల నుండి సహాయం పొందుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీజె రాష్ట్ర ఉపాధ్యక్షులు అహ్మద్ అబ్దుల్ నయీమ్, ప్రధాన కార్యదర్శి సలీమ్ అల్- హింది, కార్యదర్శి ఎం.ఏ. సత్తార్ షారూఖీ, కోశాధికారి అహ్మద్ హెచ్. షకీల్ లు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ డాక్టర్ ఖలీఖుర్ రహ్మాన్, జహీర్, నాసర్ అహ్మద్, హకీమ్, సతీష్, రజబాలి, రఫీఖ్, జమీల్, అజీజ్, గఫార్, రాజారావు పాల్గొన్నారు.