Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్ డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
సుభాష్ నగర్ కాలనీలోని కరకట్ట ప్రాంతాన్ని టీపీసీసీ సభ్యులు బడగం శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. సుభాష్ నగర్ కాలనీ వాసులతో సుదీర్ఘంగా చర్చించి అక్కడి వారి నిర్ణయాన్ని సేకరించారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేయడమే ధ్యేయంగా నడుచుకుంటుందని సుభాష్ నగర్ కాలనీ వాసులకు, ముంపు ప్రాంత ప్రజలకు ఇష్టం లేకుండా వారిని ఇల్లు కాలి చేయిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ ద్వారా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సరెళ్ల నరేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొడ్డిపట్ల సత్తి లింగం, సరేళ్ళ వెంకటేష్, నిట్టరాజు కాలనీవసులు కావూరు గోపి, కావూరు ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.