Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం (ఖమ్మం రూరల్)
ఖమ్మంలో డిసెంబర్ 5 ,6,7, తేదీల్లో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంరూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన జనరల్ బాడీ సమావేశానికి పాపాచారి అధ్యక్షత వహించగా నున్నా మాట్లాడారు. వ్యకాస రాష్ట్ర మహాసభల జయప్రదానికి ప్రజలు, వ్యవసాయ కార్మికులు విరివిరిగా విరాళాలు ఇచ్చి మహాసభ జయప్రదానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపికి అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళలపై, దళితులపై నిత్యం దాడులు చేసి హత్యలు చేస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో బిజెపి తన అనుబంధం లాయర్ అసోసియేషన్ వారు తెల్దారుపల్లి వచ్చి కమ్యూనిస్టులపై అవాకులు చవాకులు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. గుజరాత్లో 3 వేల మందిని ఊచ కోత కోసిన చరిత్ర బిజెపిది అన్నారు. అలాంటివారు తెల్దారుపల్లి ఘటనపై సీబీఐ విచారించాలనటం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పర్యటించి అల్లరిలో సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, మతతత్వ బిజెపిని తరిమికొట్టాలన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, గ్రామ సర్పంచ్ సిద్ధినేని కోటయ్య, పార్టీ నాయకులు తమ్మినేని వెంకట్రావు, ఆంధ్ర బ్యాంక్ వైస్ చైర్మన్ తమ్మినేని విజయలక్ష్మి, పార్టీ మండల నాయకులు ఎర్ర నరసింహారావు, తమ్మినేని ఉమా, ఐద్వా మండల కార్యదర్శి పెండ్యాల సుమతి, శాఖ కార్యదర్శి సిరికొండ నగేష్, గజ్జి పట్టాభి, రాజేశ్వరి, మేడికొండ నాగేశ్వరరావు, వేగినాటి వెంకటేశ్వర్లు, మర్రి సన్మంత్రావు, మర్రి బాబు, ఉష, లక్ష్మి, గుంటి వెంకన్న, పడిశాల లక్ష్మణ్, పోతురాజు తిరపయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రజా సంఘం నాయకులు బండి రమేష్ పిలుపునిచ్చారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ త్రీ టౌన్ ప్రాంతంలోని స్థానిక సుందరయ్య నగర్లో మంగళవారం ప్రచార క్యాంపియన్లో ప్రజా సంఘం జిల్లా నాయకులు బండి రమేష్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రజా సంఘం నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు షేక్ హిమాం, డివైఎఫ్ఐ నాయకులు రంగు హనుమంత చారి, సారంగి పాపారావు, పెద్దోజు ఉపేంద్ర చారి, ఎర్ర నగేష్, సుగ్గల హనుమంతరావు, వనమాల కృష్ణ పాల్గొన్నారు.