Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
నవతెలంగాణ- ఖమ్మం
తొలి తరం ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన కొండా లక్ష్మణ్ బాపూజీ, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా, తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారని, వారి జీవితం భావి తరాలకు ఆదర్శనీయుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండపై ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుసుధన్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకులు నాగభూషణంలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, అదనపు కలెక్టర్ ఎన్.మదుసూదన్, అడిషనల్ డి.సి.పి శబరీష్, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివద్ధి అధికారి జ్యోతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి టీడీపీ నివాళి
ఖమ్మం : తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య, రాష్ట్ర కార్యదర్శి నాగెండ్ల మురళి, గుడిపూడి నాగేశ్వరరావు, లేళ్ళ లక్ష్మణ్ పాల్గొన్నారు.
చింతకాని : మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమంలో జడ్పిటిసి కిషోర్, ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు అనిల్ కుమార్, మురళీ, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.