Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి కెసిఆర్ శ్రీరామరక్ష : మంత్రి పువ్వాడ
- రామకృష్ణాపురంలో టిఆర్ఎస్లో చేరికలు
నవతెలంగాణ- చింతకాని
కెసిఆర్ ఒక్కడు మాత్రమే రాష్ట్రానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 70 కుటుంబాలు మంత్రి పువ్వాడ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మంత్రి పువ్వాడ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధి ఎనిమిది ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో చేసి చూపించామన్నారు. వచ్చే ఎన్నికల్లో కమల్రాజును ఎమ్మెల్యేగా తనతో అసెంబ్లీకి పంపించాలని, అలా పంపిస్తే మధిర నియోజకవర్గం రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న హామీ ఇచ్చారు అదేవిధంగా కార్యకర్తలు ఈ ఏడాది కష్టపడి వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే తోలు తీస్తానని ప్రతిపక్ష పార్టీలకు పరోక్షంగా హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మండల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, జడ్పిటిసి కిషోర్, రామకృష్ణాపురం గ్రామ సర్పంచ్ కన్నెబోయిన కుటుంబరావు, నాయకులు కురుగుంట్ల రవీందర్ రెడ్డి, కురుగుంట్ల నర్సిరెడ్డి పిన్నెల్లి శ్రీనివాస్శెట్టి, సురేష్, శ్రీకాంత్ పలువురు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.