Authorization
Sun April 06, 2025 04:35:40 am
- మార్కెట్ ఛైర్పర్సన్ డౌలే లక్ష్మీ ప్రసన్న
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
పంటల కొనుగోళ్లకు సంబంధించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ డౌలే లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఖమ్మం మార్కెట్ కార్యాలయంలో లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే పెసలు విక్రయానికి వస్తున్నాయని, త్వరలో పత్తి విక్రయానికి రానున్నట్లు తెలిపారు. పత్తి రైతులకు మెరుగైన ధర అందేలా కృషి చేయాలన్నారు. యార్డుల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో 2022 జూన్ నుంచి ఆగస్ట్ నెల వరకు ఉన్న ఆదాయ, వ్యయాలను పరిశీలించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షల మల్లేశం, పాలకవర్గ సభ్యులు నారపోగు నాగయ్య, అజ్మీర వెంకన్న, షేక్ అఫ్టల్, నాగండ్ల భద్రయ్య, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, పత్తిపాక రమేష్, గ్రేడ్ -2 కార్యదర్శి బి. బజార్, సహాయ కార్యదర్శులు డి. నిర్మల, ఎన్. రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.