Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మండల పరిధిలోని చాపరాల పల్లి గ్రామంలో రైతులు సాగుచేసిన పత్తి, మిరప, వరి పంటలను ఏవో కరుణామయి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. వీడపీడల నివారణకు వాడాల్సిన మందులను వివరించారు. అదేవిధంగా పురుగుమందును పైరు అంతా తడిచే విధంగా పిచికారీ చేయాలని సూచించారు. ఆమె వెంట ఏఈవో రజనీకాంత్, రైతులు పాల్గొన్నారు.