Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పనిప్రదేశంలో ఎల్లప్పుడూ రక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జీఎం ఎం.షాలేము రాజు అన్నారు. స్థానిక కోయగూడెం ఓసీలో ఇండ్లు, భూములు కోల్పోయిన ధారపాడు గ్రామా నిర్వాసితులకు ఇల్లందు ఏరియా జీఎం కార్యలయంలో మంగళవారం జీఎం ఎం.షాలేము రాజు ఉద్యోగనియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భముగా మాట్లాడారు. ఉద్యోగంలో చేరిన యువత ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనిలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని తమ కుటుంబ సభ్యులకు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎజియం(ఐఇడి)గిరిధరరావు, డిజిఎం(పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఏరియా సర్వే ఆఫీసర్ బాలాజీ నాయుడు, ఎస్టేట్ అధికారులు పి.మహేశ్వర్, శివ వీర కుమార్, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.