Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో గీత కార్మికుల కోసం ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, అందులో ప్రభుత్వమే హరితహారం పేరుతో తాటి, ఈత మొక్కలు నాటి, వనాలు పెరిగేలా కార్యక్రమం చేపట్టాలని మర్కోడు గౌడ సంఘం నాయకుడు తాళ్లపల్లి వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో తాత ముత్తాతల కాలం నుంచి మా కుల వృత్తి అయిన గీత కార్మికులుగా తాటిచెట్టు ఎక్కి కల్లు తీసి, అమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, ఎవరికైనా వృత్తి పరంగా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లేకుండా పోయిందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని గీత కార్మికులకు ఏజెన్సీలో వృత్తి లైసెన్స్లు, సొసైటీ ఇన్సురెన్స్లు వర్తించేలా చూడాలని కోరారు. అందులో భాగంగా మంగళవారం మండలంలోని గీత కార్మికుల పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాన్ని ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మణుగూరులో అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్కోడు ఉప సర్పంచ్ కుర్ర కమల, గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి నవీన్, బూర్ణ సతీష్, తాళ్లపల్లి శ్రావణ్, కె.చంద్రశేఖర్, టి.శేఖర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.