Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పి రాఘవేంద్రరావు అన్నారు. మంగళవారం వలస ఆదివాసి గ్రామాలైనా రేగులగండి, సర్వాయిగుంపులలో పోలీసుల ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. 56 మందికి బూస్టర్ డోస్ వేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లోకి పరిచయంలేని వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్లబయ్యారం, అశ్వాపురం, మణుగూరు సిఐలు, ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.