Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'క్రాంతి' శారీస్, బోటిక్ వస్త్రాలయం ప్రారంభం
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలోని కల్పతరు రోడ్డులో నూతనంగా ఏర్పాటైన క్రాంతి శారీస్, బోటిక్ వస్త్రాలయాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం ప్రారంభించారు. ప్రస్తుత జనరేషన్‌కు అనుగుణంగా పెద్దపెద్ద నగరాల్లో లభ్యమయ్యే ఫ్యాషన్ చీరలు, సంప్రదాయ వస్త్రాలను పట్టణంలోని మహిళలకు అందుబాటులోకి తీసుకురావడమే గాక ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. క్రాంతి శారీస్ యాజమాన్య బాధ్యులు, కౌన్సిలర్ వీరపనేని రాధికాబాబీ, కోనేరు తేజష్విణిని కోరారు. ఎమ్మెల్యే సండ్ర సతీమణి మహాలక్ష్మి మొదటి కొనుగోలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ కోడూరు సుజాత, ఏసీపీ వెంకటేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.