Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం సహకార సంఘం చైర్మెన్ మండే
నవతెలంగాణ-కొత్తగూడెం
సహకారం సంఘం అన్ని విధాలుగా రైతులకు సహాయ సహకారాలు అందిస్తుందని కొత్తగూడెం సహకార సంఘం చైర్మెన్ మండే వీర హనుమంత రావు అన్నారు. బుధవారం చుంచులిప్ల మండలం, హౌసింగ్ బోర్డు లోని కొత్తగూడెం సహకార సంఘ కార్యలయంలో సంఘ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో సొసైటీ ద్వారా సుమారు రూ.126 లక్షల ఎరువులు, రూ.50 లక్షల సబ్సిడీపై విత్తనాలు రైతులకు సరఫరా చేశారు. 218 మంది రైతులకు రుణమాఫీ నిధులు రూ.62 లక్షలు పంపిణీ చేశారు. సుమారు రూ.1913 లక్షల ధాన్యంను కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు నగదు జమ చేశామన్నారు. రూ.1,157 లక్షల రైతుల రుణాలను రెన్యూవల్ చేయటం జరిగిందన్నారు. రైతులకు నిత్యం సహకార సంఘం ద్వారా సేవ చేస్తామని, నూతన పంట రుణాలను కూడా ఇస్తున్నామని, వడ్డీ చెల్లించని రైతులు చెల్లించి రైతు రుణాలను రెన్యూవల్ చేయవలసినదిగా కోరారు. ఈ సంవత్సరం ప్రభుత్వ మద్దతు ధరకు వరి, ధాన్యం కొనుగోలు చేస్తామని, త్వరలో సొసైటీ ద్వారా పురుగు మందులు షాపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంకు బ్రాంచి కొత్తగూడెం మేనేజర్ బి.విజయ, సొసైటీ డైరెక్టర్ వేల్పుల మల్లేష్, బండి అమృత రావు, గుగులోతు చందర్, తీట్ల విజయకుమారి, పోటు వెంకటేశ్వర రావు, మాలోతు సేవ్యా, చంద్రగిరి శ్రీనివాస్ రావు, కంటిం సత్యనారాయణ, సొసైటి సీఇఓ పండ్ల సారయ్య, సంఘ సిబ్బంది రైతులు దొడ్డి రామకృష్ణ, లావుడ్య పూర్ణ చందులాల్, కొమారి రవీందర్ పాల్గొన్నారు.