Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేడుకలలో పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ ప్రాంతంలో వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చైర్పర్సన్ డౌలే లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో పువ్వాడ వసంత లక్ష్మి, మంత్రి కోడలు, నగర మేయర్ పునుకోల్లు నీరజలతో కలిసి గౌరమ్మకు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి నానే బియ్యం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి వ్యవసాయ మార్కెట్లో ఉంచి చిన్నా పెద్దా కలిసి పాటలతో హౌరెత్తింస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్లో బతుకమ్మ ఆట ఆడిన మహిళలకు ఉత్తమ బతుకమ్మలను పేర్చిన వారికి మొదటి, బహుమతి, రెండవ, బహుమతి, మూడవ బహుమతులను పువ్వాడ కనుకానుగా మంత్రి పువ్వాడ చేతుల మీద అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షల మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు డౌలే సాయికిరణ్, మార్కెట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.