Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సమాజహితం కోసం వికాస తరంగిణి అందిస్తున్న సేవలు అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం స్థానిక కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మహిళా మెగా వైద్య శిబిరాన్ని సండ్ర ప్రారంభించారు. హైదరాబాద్, విజయనగరంకు చెందిన వైద్యులు డాక్టర్ మాధవి, డాక్టర్ సమతలు మహిళలకు పలు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి ఏసీపీ ఎన్.వెంకటేశ్, సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, వికాసతరంగిణి బాధ్యులు ఎన్సీహెచ్ రామకృష్ణమాచార్యులు, మందపాటి కేశవరెడ్డి, చల్లగుళ్ల లోకేశ్వరరావు, నరుకుళ్ల సత్యవతి, రాయల పుష్పవతి, కోటేశ్వరీ, యశ్వంత్, రాఘవయ్య, కొనకళ్ల శారద పాల్గొన్నారు.