Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-బూర్గంపాడు
మతతత్వ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం మండలం మోరం పల్లి బంజర గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్, బీజేపీల నుంచి 150 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీలో రేగా కాంతారావు సమక్షంలో చేరారు. తొలుత కాలనీలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం జరిగిన సభలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భం గా రేగా కాంతారావు మాట్లాడుతూ దేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పాలన చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుల వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ సభకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మోరంపల్లి బంజర గ్రామ ఉప సర్పంచ్ కైపు లక్ష్మి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ యువజన మండల అధ్యక్షులు గోనెల నాని, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కైపు సుబ్బరామిరెడ్డి, మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, సాబీర్ పాషా మాజీ జెడ్పిటిసి భూపల్లి నరసింహారావు, పార్టీ నాయకులు గాదె నర్సిరెడ్డి పాల్గొన్నారు.