Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్కర్ల వేతనాల బడ్జెట్ విడుదల...!
- ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల
- బడ్జెట్ వెంటనే విడుదలచేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ - భద్రాచలం :సీఐటీయూ పోరాట ఫలితంగా హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ల వేతనాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 12 కోట్ల 57 లక్షల రూపాయలు విడుదల చేసిందని, ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మూడు కోట్ల 13 లక్షల రూపాయలు కేటాయించారని, బడ్జెట్ విడుదల పట్ల తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు హర్షం వ్యక్తం చేసింది. అయితే ఆరు నెలల వేతల బకాయిలకు గాను కేవలం మూడు నెలలకు సరిపోయే బడ్జెట్ మాత్రమే విడుదల చేశారని మిగిలిన మూడు నెలల బడ్జెట్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 14 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు కూడా వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని కోరారు. సెప్టెంబర్ 26వ తేదిన సిఐటియు ఆధ్వర్యంలో హాస్టల్ డైలీ వేర్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ హైదరాబాదులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఫలితంగా కొద్ది మేరకు బడ్జెట్ విడుదల చేశారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె. బ్రహ్మచారి తెలిపారు. ఇంకా ఔట్ సోర్సింగ్ కార్మికులకు రావలసిన బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండగ పూట పస్తుల ఉంచుతారా ? పెండింగ్ వేతనాలు చెల్లించండి అనే డిమాండ్‌తో సీఐటియు ఆధ్వర్యంలో జరిపిన పోరాటాల ఫలితంగానే ఈ మేరకైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి బడ్జెట్ విడుదల చేసిందని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు బడ్జెట్ విడుదల చేయడంతో పాటు అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.