Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ పాల్వంచ
ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే ప్రభుత్వ భూములు ఆక్రమించి పేదలకు పంచుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ హెచ్చరించారు. పేదలకు ఇండ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని, స్థలం ఉన్న ప్రతికుటుంబా నికి 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని, నిత్యావసర సరుకులపై జిఎస్టి రద్దు చేయాలని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరుపేదలు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. తొలుత అల్లూరి సెంటర్ పార్టీ ఆఫీసు నుండి వందలాది మందితో భారీ ర్యాలీ నటరాజ్ సెంటర్, శాస్త్రి రోడ్, రాజీవ్ మార్కెట్ మీదుగా తహసీల్దార్ ఆఫీసుకు చేరుకొని ధర్నా చేశారు. ఈ సందర్బంగా పట్టణ కమిటీ సభ్యురాలు కె సత్య అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి 8 సంవత్సరాలు అయినప్పటికి ఇప్పటికి అమలుకు నోచుకోలేదని హామీలు నీటి మూటలుగానే మిగిలి పోయాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ప్రజల మీద భారాలు పెంచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. నిత్యావసర సరుకుల మీద జిఎస్టి విధించి మోయలేని భారం మోపారని 2 సంవత్సరాల క్రితం కుటుంబానికి 3000 రూపాయల ఖర్చుతో సరుకులు వచ్చేవని ఇప్పుడు అదే సరుకులకు 6000 నుండి 7000 ఖర్చు చేయాల్సి వస్తున్నదని, కరెంటు బిల్లుల డబుల్, త్రిబుల్ అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు ,ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి పేదలకు పంచుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ఎం.జ్యోతి, పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్, పట్టణ కమిటీ సభ్యులు మెరుగు ముత్తయ్య, వి సత్యవాణి, ఎస్.కె నిరంజన్, ఎస్.కె రహీం, తులసిరామ్, కాంతి శాఖ కార్యదర్శులు తదితరులు ప్రజలు పాల్గొన్నారు.