Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడుల వలన ప్రజల్లో ఆందోళన...
- అసహనం వ్యక్తం చేసిన ఐఎంఏ వైద్యులు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ ఆసుపత్రులపై జిల్లా ప్రభుత్వ వైద్యాధికారులు తనిఖీల పేరుతో దాడులు నిర్వహించడం సరైంది కాదని, నోటీసులు లేకుండా వైద్యశాఖ ఇష్టారాజ్యంగా తనిఖీలు చేయడం బాధాకరమని కొత్తగూడెం ఐఎంఏ సభ్యుల వైద్య బృందం అసహనం వ్యక్తం చేశారు. బుధవారం కొత్తగూడెం ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు పట్టణ వైద్యులు మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆసుపత్రులను తనిఖీలు చేస్తున్నారని ఇది సరైన కాదన్నారు. ఇలాంటి దాడుల వలన సామాన్య ప్రజలల్లో ఆందోళన చోటు చేసుకుంటుందని చెప్పారు. ఆసుపత్రులకు రావాలంటే భయాందోళనకు గురిఅవుతారని తెలిపారు. అత్యవసర సమయంలో రోగులకు వైద్యం అందకుండా పోతుందని సూచించారు. అసుపత్రులపై ఈ దాడుల వలన మారుమూల గిరిజనుల్లో డాక్టర్లమీద అపనమ్మకం కలిగి, సరైన సమయంలో వైద్యం అందకపోతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. కొన్ని ఆసుపత్రులకు రెన్యువల్ లేదని నెపంతో ఆస్పత్రులను సీజ్ చేస్తామని చెప్పడం సరైనది కాదన్నారు. రెన్యువల్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే డిఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలో ఒక పక్క పెండింగ్ పెట్టి కాలయాపన చేస్తూ, మరోపక్క రెన్యూవల్స్ చేయుంచుకోలేదని, అనుమతులు లేవని చెప్పి దాడులు చేయడం మంచిది కాదన్నారు. ఈ విషయాన్ని డిఎంహెచ్వో కార్యాలయం సిబ్బంది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం హితవు పలికారు. తనిఖీలకు జిల్లా స్థాయి అధికారులు రాకుండా కింది స్థాయికి సిబ్బందిని పంపించడం వల్ల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీని వల నైపుణ్యత కలిగిన పట్టణ ప్రముఖ వైద్యులు ఇబ్బందులు పడుతున్నారని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పెద్ద ఆస్పత్రుల పైన అధికారులు దృష్టి పెడుతున్నారే తప్పా,...ఆర్ఎంపీలపై ప్రేమలు వలకపోస్తున్నట్లు కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా వైద్యం చేస్తున్నప్పటికీ వారిపై డిఎంఅండ్హెచ్ఓ కార్యాలయం దృష్టిపెట్టక పోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. తనిఖీల వలన పేరుగాంచిన ఆసుపత్రుల పేరు దెబ్బతినే ప్రమాదం, రోగులు ఆసుపత్రికి రాకుండా పోవడం వలన ప్రజలకు ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎంఏ సభ్యులు డాక్టర్ అరకాల భాస్కర్, డాక్టర్ వసుధ విజయకుమార్, డాక్టర్ ఇరుకు బాబురావు, వైద్యురాలు ఉదయభాను, డాక్టర్ పాషా, డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ అయ్యప్ప రాజశేఖర్ తదితర డాక్టర్ పాల్గొన్నారు.